శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 జులై 2016 (14:33 IST)

ఇక నటించింది చాలు... ఆపేయ్... సమంతకు నాగ్ సలహా..? SIIMAలో చూపిస్తోంది మరి...

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా నాగచైతన్య- సమంతల మధ్య ప్రేమాయణం జరుగుతోందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వీరిద్దరి ప్రేమను ఓకే చేసేందుకు వ్యవహారం నాగార్జున వద్దకు వెళ్లిందనీ, ఐతే మీ ప్రేమను నేను అంగీకరించాలంటే ఓ కండిషన్ కు ఒప

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా నాగచైతన్య- సమంతల మధ్య ప్రేమాయణం జరుగుతోందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వీరిద్దరి ప్రేమను ఓకే చేసేందుకు వ్యవహారం నాగార్జున వద్దకు వెళ్లిందనీ, ఐతే మీ ప్రేమను నేను అంగీకరించాలంటే ఓ కండిషన్ కు ఒప్పుకోవాలని నాగ్ సూచన చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
ఇంతకీ ఆ కండిషన్ ఏంటయా అంటే... ఇకపై సమంత సినిమాల్లో నటించకూడదట. ఆ ప్రకారం సమంత కనుక సినిమాల్లో నటించనట్లయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నాగార్జున చెప్పినట్లు టాలీవుడ్ ఫిలింనగర్లో గాసిప్స్ తిరుగుతున్నాయి. ఇదిలావుంటే SIIMA 2016 అవార్డు ఫంక్షన్లకు సమంత ఎద అందాలను ఆరబోస్తూ దుస్తులు వేసుకువచ్చింది. మరి ఇలాంటి అప్పియరెన్స్ పైన నాగార్జున మళ్లీ ఏమైనా అభ్యంతరం చెపుతాడేమోనని కొందరు గొణుక్కుంటున్నారు.