ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (23:10 IST)

సమంత సంచలన నిర్ణయం.. నయనతార అడ్వైజ్ ఆయుర్వేద చికిత్స కోసం..? (video)

Samantha
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకుంది. అరుదైన వ్యాధితో బాధపడుతూ వస్తోన్న సమంత ఇకపై సినిమాలకు దూరం కానుందనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. 
 
ఈ వ్యాధి కోసం ఆమె చికిత్స తీసుకుంటోంది. ఇందుకోసం కేరళకు వెళ్లినట్లు సమాచారం. లేడి సూపర్ స్టార్ నయనతార సూచన మేరకు సమంత ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి నుంచి తాను త్వరలో కోలుకుంటానని చెప్పిన సమంత ప్రస్తుతం సినిమాల్లో కనిపించేది లేదని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేంతవరకు సినిమాలకు ఆమె దూరం కావాలని భావిస్తున్నట్లు సమాచారం. హిందీలో ది ఫ్యామిలీ సీజన్ 2 కార్యక్రమం విజయం సాధించడంతో, పలు బాలీవుడ్ సినిమాలను సమంత అంగీకరించింది. కానీ వ్యాధి కారణంగా ఆమె కొంత బ్రేక్ తీసుకోవాలనుకుంటుంది. దీంతో బాలీవుడ్ సినిమాల్లో సమంత ఇప్పటికీ నటించేది లేదని తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు కూడా సమంత చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా పూర్తయిన తర్వాత సినిమాలకు సమంత కొంతకాలం దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.