మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (17:14 IST)

ప్రేమ గురించి సమంత పోస్టు... మరణం నుంచి ఏదీ రక్షించలేకపోతే..?

Samantha with gold
టాలీవుడ్ నటి సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. సమంత ఇన్‌స్టాలో ప్రఖ్యాత పాశ్చాత్య రచయిత పాబ్లో నెరూడా కొటేషన్‌ను పంచుకుంది. "మనల్ని మరణం నుంచి ఏదీ రక్షించలేకపోతే, కనీసం ప్రేమ అయినా మనల్ని జీవితం నుంచి కాపాడాలి కదా!" అన్నదే ఆ పోస్టు పరమార్థం. 
 
ఈ కొటేషన్‌కు తోడుగా సమంత ఇద్దరు లవర్స్ కలిసున్న ఫొటోను పంచుకోవడంతో కొద్దిసేపట్లోనే ఇది వైరల్ అయింది. అక్కినేని నాగచైతన్యతో వైవాహిక జీవితానికి రెండేళ్ల కిందట చరమగీతం పాడిన సమంత... అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతోంది.