ఆ లవ్ స్పాట్లో హీరోయిన్‌తో చైతూ ఫోటోలు... వార్నింగ్ ఇచ్చిన సమంత..?

నాగచైతన్య, సమంతలు వివాహం చేసుకున్న తరువాత కూడా సినిమాల్లో బిజీబిజీగానే గడుపుతున్నారు. నాగచైతన్య కన్నా సమంత చేతిలోనే ఎక్కువగా సినిమాలు ఉన్నాయి. దీంతో క్షణం తీరిక లేకుండా చాలా బిజీగా గడిపేస్తోంది సమంత. అయితే ఈ మధ్య సవ్యసాచి అనే సినిమాతో నాగచైతన్య కూడా

Nidhi Agarwal
TJ| Last Modified సోమవారం, 2 జులై 2018 (20:46 IST)
నాగచైతన్య, సమంతలు వివాహం చేసుకున్న తరువాత కూడా సినిమాల్లో బిజీబిజీగానే గడుపుతున్నారు. నాగచైతన్య కన్నా సమంత చేతిలోనే ఎక్కువగా సినిమాలు ఉన్నాయి. దీంతో క్షణం తీరిక లేకుండా చాలా బిజీగా గడిపేస్తోంది సమంత. అయితే ఈ మధ్య సవ్యసాచి అనే సినిమాతో నాగచైతన్య కూడా బిజీ అయిపోయారు. సవ్యసాచి సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ హీరోయిన్‌తో ఇప్పుడు చాలా బిజీ షూటింగ్‌లో ఉన్నారు నాగచైతన్య. 
 
ఏ మాయే చేశావే సినిమాలో క్లైమాక్స్ సీన్ నాగచైతన్య, సమంతల మీద ఎక్కడైతే షూటింగ్ చేశారో.. అదే ప్రాంతం, అంటే న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో అదే ప్రాంతం నుంచి ఇప్పుడు సవ్యసాచి సినిమాలోని ఒక పాటను యూనిట్ చిత్రీకరిస్తోందట. అయితే నాగచైతన్య నిధీ అగర్వాల్‌తో క్లోజ్‌గా కొన్ని ఫోటోలు అదే స్థలం నుంచి దిగారట. ఇది కాస్త సమంతకు బాగా కోపం తెప్పించిందట. 
 
మన ప్రేమ మొదలైన ప్రాంతంలో నువ్వు వేరే అమ్మాయితో ఎలా క్లోజ్‌గా ఉంటావని చైతూను ప్రశ్నించిందట సమంత. రెండురోజుల నుంచి ఇద్దరి మధ్యా మాటలు లేకుండా కూడా పోయిందట. అయితే ఇదంతా సినిమాలోనేనన్న విషయం నీకు తెలియదా అని నాగచైతన్య బుజ్జగించి సమంతను దగ్గర చేర్చుకుని నచ్చజెప్పారట. దీంతో సమంత అలకపాన్పు నుంచి కిందకు దిగేసిందట.దీనిపై మరింత చదవండి :