Widgets Magazine

పెద్ద త‌ప్పుచేసినట్లు.. మోసం చేసిన‌ట్లు బూతులు తిట్టారు: స‌ంపూర్ణేష్ బాబు

ఆదివారం, 2 జులై 2017 (14:01 IST)

Widgets Magazine
Sampoornesh

తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఉన్న యువ హీరోల్లో సంపూర్ణేష్ బాబు ఒకరు. హృదయ కాలేయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమై ఓ గుర్తింపును సొంతం చెసుకున్నాడు. ముఖ్యంగా.. తెలుగు సినిమాల్లో ఉండే ఓవ‌ర్ యాక్ష‌న్‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించి, క‌డుపుబ్బా న‌వ్విస్తుంటాడు. 
 
అయితే, చిత్రపరిశ్రమలో తనకు ఎదురై చేదు అనుభవాలపై ఆయన తాజాగా స్పందించారు. హృదయ కాలేయం చిత్రం విడుద‌లైన తర్వాత‌ త‌న‌కు ఎవ‌రెవ‌రో ఫోన్లు చేసి, తానేదో పెద్ద త‌ప్పుచేసినట్లు, మోసం చేసిన‌ట్లు బండ‌ బూతులు తిట్టారని చెప్పారు. 
 
ఆ సినిమా ఏంటీ? నువ్వు హీరో ఏంటీ? అని ఎన్నో మాట‌లు అనేవార‌ని అన్నాడు. దీంతో త‌న‌కు ఫోన్ వ‌స్తే ఎత్తాలంటే భ‌యం వేసేదని చెప్పాడు. జీవితంలో ఎవ్వ‌రికీ అలాంటి బాధ రాకూడ‌ద‌ని అనుకున్నానని తెలిపాడు.
 
త‌న‌కు డ్యాన్స్ బాగా చేయాల‌నిపిస్తుందని కానీ, త‌న‌కు డ్యాన్స్ రాదని చెప్పాడు. ప్రతిసారి తాను ఏది అవ‌స‌ర‌మో అదే నేర్చుకుని, అక్క‌డే మ‌ర్చిపోతానని చెప్పాడు. తన‌కు ఓ న‌టుడు కావాల‌ని చిన్నప్పటి నుంచీ కోరిక ఉండేద‌ని, ఏకంగా హీరోనే అయిపోయాన‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జరగాల్సిన డ్యామేజ్ జరిగింది... ఇపుడు చెప్పేందుకు ఏమీలేదు : భరత్ మరణంపై హీరో రవితేజ

తన సోదరుడు భర్త మరణం, అంత్యక్రియల సమయంలో తమ ఫ్యామిలీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనీ, ...

news

రోజూ తాగొచ్చి చావబాదుతున్నాడు : నటుడిపై భార్య ఫిర్యాదు

తమిళ బుల్లితెర, సినీ నటుడిపై అతని భార్య చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతి రోజూ ...

news

తాప్సీతో డేటింగ్ కాదు కానీ ఆ బంధం మాత్రం చాలా బలంగా వుంది... బాలీవుడ్ హీరో

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి గ్లామర్ ఆరబోసిన తాప్సి పన్ను ఇప్పుడు బాలీవుడ్ ...

news

రోమియో జూలియట్ మ్యూజికల్ డ్రామాలో వరలక్ష్మీ శరత్ కుమార్

సినీ నటుడు శరత్ కుమార్, విశాల్ గర్ల్ ఫ్రెండ్‌గా పిలవబడుతున్న వరలక్ష్మీ రూటు మార్చింది. ...