శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 30 జూన్ 2015 (15:46 IST)

కాఫీ షాప్స్... పబ్ సెంటర్లలో రాశీఖన్నా, నాగశౌర్య... అదో 'తుత్తి'నా...?

రాశిఖన్నా ఇప్పుడు టాలీవుడ్ సెక్సీ బ్యూటీల లిస్టులో చేరిపోయింది. ఆమెకు వరసబెట్టి ఆఫర్లు కూడా తన్నుకుంటూ వస్తున్నాయి. ''ఊహలు గుసగుసలాడే'' చిత్రంలో నాగశౌర్యతో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులతో బాగానే గుసగుసలాడింది. ఐతే ఇప్పుడా ముద్దుగుమ్మ ఏకంగా ఆ చిత్రం హీరోతో గుసగుసలాడుతోందట. 
 
హైదరాబాద్ ఫిలిమ్ నగర్లోని కాఫీ షాప్స్, పబ్ సెంటర్లలోని డిమ్ లైట్ల మధ్య ఇద్దరూ ఏదో గుసగుసలాడుకుంటూ కనిపిస్తున్నారట. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగానే ఉంది కనుక ఇద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ కూడా జరిగిపోతోందని టాలీవుడ్ ఫిలిమ్ జనం గుసగుసలాడుకుంటున్నారు. కొందరైతే అలా కలిసి కాఫీ తాగితే అదో తుత్తి అని జోకులేస్తున్నారంట.
 
ఐతే రాశిఖన్నా, నాగశౌర్య మాత్రం.... కలిసి కాఫీ తాగినా, పబ్ సెంటర్లకు వచ్చినా ఇక లింక్ పెట్టేస్తారా అని అంటున్నారట. ఏదో ఒక ఫ్రెండ్‌షిప్ లేకపోతే అలా కలిసి రారు కదా మరి. కాగా రాశీ ఖన్నా రవితేజ చిత్రం బెంగాల్ టైగర్‌లో నటిస్తోంది. నాగశౌర్య కొత్త ప్రాజెక్టులపై లుక్కేస్తున్నాడు.