సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 జనవరి 2023 (11:41 IST)

ఎన్నారైతో శర్వానంద్ పెళ్లి.. నిజమేనా?

Sarvanand
టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. శతమానం భవతి నటుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎన్నారై అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. 
 
వధువు రెడ్డి సామాజికవర్గానికి చెందినదని, అమెరికాలో నివసిస్తుందని చెబుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కారణంగా ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉంటోందని కూడా వార్తలు వస్తున్నాయి. 
 
గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకు అతిథిగా హాజరైన శర్వానంద్ పెళ్లిపై సరదా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మరి తాజా పుకార్లపై శర్వానంద్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.