మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (23:14 IST)

బాలీవుడ్‌లో కొత్త ప్రేమపక్షులు.. ఎవరో తెలుసా?

Kiara_Siddarth
బాలీవుడ్‌లో లవ్వాయణాలు, బ్రేకప్‌లు.. విడాకులు సర్వసాధారణం. తాజాగా బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా లవ్ స్టోరీ గురించే పెద్ద రచ్చ సాగుతోంది. బాలీవుడ్ లో ఎం.ఎస్ ధోనీ సినిమాతో కియారా అద్వానీ చిత్ర రంగ ప్రవేశం చేస్తే.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. దాదాపుగా ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ జంట చెట్టపట్టాలేసుకు తిరుగుతూ వార్తల్లోకెక్కుతోంది. 
 
విక్రమ్ బాత్రా సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి నటించే సందర్భంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని.. అప్పటి నుండి మాల్దీవులకు వెకేషన్, సిద్దార్థ్ ఇంట్లో కియారా ఉండడం వంటి ఘటనలు నో డౌట్ సమ్ థింగ్ ఏదో ఉందనుకొనేలా చేశాయి.
 
అయితే.. ఇప్పటివరకు ఈ జంట రిలేషన్ మీద నోరువిప్పకపోగా తొలిసారి కియారా గుట్టువిప్పేసింది. సిద్దార్థ్ ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితుడు కాగా తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. ఇంతకీ పెళ్ళెప్పుడు కియారా అంటే.. అది ఎప్పుడో ఇప్పుడే చెప్పలేను కానీ ఖచ్చితం లవ్ మ్యారేజే అని చెప్పింది. దీంతో మేము మంచి ఫ్రెండ్స్ అంటూ.. చివరికి కొంపముంచేవాళ్లని చాలా చూశాంలే వెళ్ళెళ్ళవమ్మా అంటున్నారు బీటౌన్ జనాలు.