మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (16:49 IST)

ఏంటి.. అనుష్కతో లింకెట్టేస్తారా? దేవసేనతో పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్

ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాహుబలి-2. ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో హీరో ప్రభాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాహుబలి - దేవసేన

ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాహుబలి-2. ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో హీరో ప్రభాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాహుబలి - దేవసేన పెళ్లి విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు హీరో సమాధానమిచ్చారు.
 
'ప్రస్తుతానికి నా పెళ్లి గురించి అభిమానులు (మహిళా అభిమానులు) ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. అలాంటి పనిని ఇప్పుడప్పుడే చేయదలచుకోలేదు. దానిగురించి కూడా నేను ఆలోచించట్లేదు. ఇప్పుడు నన్ను ఇంతమంది అభిమానిస్తున్నారంటే అది నా అదృష్టం' అని ప్రభాస్ అన్నారు. 
 
అంతేకాదు, 'ఓ హీరోయిన్‌తో ఓ హీరో రెండుకు మించి సినిమాలు చేస్తే ఇలాంటి రూమర్లు వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు అలాంటి వార్తలు చూస్తే బాధేసేది. ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టిస్తున్నారని బాగా ఆలోచించేవాడిని. కానీ, అలాంటి వార్తలన్నీ ఇప్పుడు నాకు సర్వ సాధారణమైపోయాయి. అలాంటి వార్తలు వచ్చినా నేను పట్టించుకోను' అని ప్రభాస్ స్పష్టం చేశారు. కాగా, ప్రభాస్ తాజా చిత్రం సాహోలో అనుష్క నటిస్తున్న విషయం తెల్సిందే.