గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (18:28 IST)

ఆకాశ్ పూరీకి ఆంటీగా సిమ్రాన్?

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి. ఈ కుర్రోడు తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఇపుడు తన రెండో సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రానికి అనిల్ పాడూరి దర్శకత్వం వహించనుండగా, ఢిల్లీ భామ కేతిక శ‌ర్మ‌ కథానాయికగా నటించనుంది. 
 
ఈ రొమాంటిక్ మూవీలో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాజాగా మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తోన్న ఈ మూవీలో సిమ్ర‌న్ కీ రోల్‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. అంటే ఆకాశ్ పూరి ఆంటీగా సిమ్రన్ క‌నిపించ‌నున్న‌ట్టు ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్ టాక్. 
 
రొమాంటిక్ మూవీ మే చివ‌రి వారంలో విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. ఈ చిత్రానికి సంబంధించిన తుది షెడ్యూల్ షూటింగ్ త్వ‌ర‌లోనే షురూ కానుంది. పూరీ ఈ మూవీకి క‌థనందించ‌డంతోపాటు స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందిస్తున్నాడు.