Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శివకార్తీకేయన్ కోసం నువ్వా నేనా అంటోన్న నయన-సమంత?

శనివారం, 15 జులై 2017 (13:56 IST)

Widgets Magazine

కోలీవుడ్‌లో అగ్రహీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. యాంకరింగ్ నుంచి హీరోగా ఎదిగిన శివకార్తీకేయన్ (రెమో ఫేమ్)కు జోడీగా నయనతార నటిస్తోంది. వేలైక్కారన్ అనే పేరిట ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో శివతో కలిసి నయన వున్న ఫోటోలు ఇప్పటికీ రిలీజైనాయి. మరోవైపు చెన్నై బ్యూటీ సమంత ఇటీవల లంగా ఓణీలో దర్శనమిచ్చింది. ఈ స్టిల్ శివ, నయన నటించే వేలైక్కారన్ కోసమేనని కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
శివకార్తికేయన్ కథానాయకుడిగా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. ఇక సమంత ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుందని సమాచారం. హీరో కోసం వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటిస్తారని తెలిసింది.
 
సమంతకు సంబంధించిన కొంతభాగం షూటింగును ఇటీవల చిత్రీకరించారని సమాచారం. చాలా సాదాసీదా యువతిగా సమంత ఈ చిత్రంలో కనిపించనుంది. నయనతార, సమంతా పోటీపడి నటించే ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ - స్నేహా కీలక పాత్రల్లో కనిపిస్తారట.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కమల్ హాసన్‌‌కు మద్దతు.. ఆయనకొక సమస్యంటే ఓరుకోం: విశాల్ వార్నింగ్

సినీ లెజండ్ కమల్ హాసన్ ప్రస్తుతం అందరి నోళ్లల్లో నానుతున్నారు. బిగ్ బాస్ కార్యక్రమానికి ...

news

వీఐపీ 2 మేకింగ్ వీడియోను చూడండి..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో వీఐపీ 2 ...

news

కవల పిల్లలను చేతపట్టుకుని.. నగ్నంగా ఫోజిచ్చిన సింగర్.. (ఫోటో)

హాలీవుడ్ గాయని బియోన్స్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల గర్భిణీగా ఉన్నప్పుడు తన ...

news

సువర్ణసుందరి మోషన్ పోస్టర్.. వీడియో

శ్రీ కృష్ణ దేవరాయల స్టోరీ ఆధారంగా సువర్ణసుందరి సినిమా పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు ...

Widgets Magazine