సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (10:07 IST)

క‌వ్వించే దుస్తుల‌తో సోనాల్ చౌహాన్, మ‌రోసారి నాగార్జున‌తో న‌టిస్తుందా!

Sonal Chauhan
Sonal Chauhan
మిరుమిట్లు గొలిపే లుక్‌తో సోనాల్ చౌహాన్ అల‌రించింది. అభిమానుల‌ను క‌వ్వించే దుస్తుల‌తో సున్నిత‌మైన దుస్తులు ధ‌రించి ఇలా ఫోజులిచ్చింది.  ఇటీవ‌లే నాగార్జున‌తో సోనాల్ చౌహాన్ ది ఘోస్ట్‌లో న‌టించింది. పూర్తిగా ఎక్స్పోజింగ్‌, గ్లామ‌ర్ పాత్ర పోషించిన ఆమె నాగార్జున న‌ట‌న బిహేవియ‌ర్ గురించి గొప్ప‌గా చెప్పింది. అయితే ఈ సినిమా విడుద‌ల‌య్యాక ఫ‌లితం పెద్ద‌గా క‌నిపించ‌లేదు. మ‌రో హిట్ ఆమె ఖాతాలో లేకుండాపోయింది.
 
Sonal Chauhan
Sonal Chauhan
అదివ‌ర‌కు బాల‌కృష్ణ‌తో లెజెండ్‌లోనూ న‌టించిన ఈ భామ నాగార్జున‌తో న‌టించింది. మ‌రోసారి ఆయ‌న‌తో న‌టించేందుకు త‌న‌కేమాత్రం అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఘోస్ట్ విడుద‌ల త‌ర్వాత ఇలా ఫొటో సెష‌న్ చేసింది. నాగార్జున ప్ర‌స్తుతం కొంత‌కాలం న‌ట‌న‌కు గేప్ ఇచ్చా ఆ త‌ర్వాత సినిమా చేయాల‌నుకుంటున్న‌ట్లు ఇటీవ‌లే వెల్ల‌డించాడు. అయితే మ‌రోసారి సోనాల్ చౌహాన్ తీసుకుంటాడా! లేదా అనేది త్వ‌ర‌లో తెలియ‌నుంది. ఈలోగా మ‌రో పెద్ద హీరో సినిమాలో ఆమె న‌టించేందుకు నాగ్ హామీ ఇచ్చిన‌ట్లు ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.