Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సోనమ్ కపూర్‌కి ఏమయినా పిచ్చా? ప్రభాస్‌తో వద్దంటోందేమిటి?

సోమవారం, 3 జులై 2017 (16:46 IST)

Widgets Magazine

సోనమ్ కపూర్. ఈమె పేరు చెప్పగానే బాలీవుడు కుర్రకారు చొంగ కార్చుకుంటారనే అభిప్రాయాలున్నాయి. పైగా మాజీ ప్రపంచ సుందరి, పెళ్లయినా గ్లామర్ అందాలతో బాలీవుడ్ ఇండస్ట్రీ లుక్‌ను తిప్పుకునే ఐశ్వర్యా రాయ్‌ను ఆంటీ అంటూ పొగరుగా సమాధానం చెప్పేస్తుంది. అంతేనా... బాహుబలి చిత్రంలో తమన్నా నటించిన అవంతిక పాత్ర ఇస్తామంటే... అబ్బే నాకేం వద్దులే అనేసిందట. ఇవన్నీ సోనమ్ కపూర్ గురించి వచ్చిన వార్తలు. 
sonam-kapoor
 
ఇక తాజా ముచ్చట ఏంటయా అంటే... బాహుబలి ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహోలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వేట జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రభాస్ సరసన నటించమని సోనమ్ కపూర్‌ను సంప్రదించారట దర్శకనిర్మాతలు. హీరోగా ప్రభాస్ నటిస్తున్నాడని కూడా చెప్పారట. ఐతే సోనమ్ మాత్రం... కూల్‌గా... సర్లే ముందు కథ చెప్పండి అని అడిగిందట. కథ విన్న తర్వాత అక్కడి నుంచి లేచెళ్లిపోయిందట. 
 
ఆ తర్వాత ఆమె నుంచి సమాధానం రాలేదట. దీనితో దర్శకనిర్మాతలు మరో హీరోయిన్ కోసం వెతికే పనిలోపడ్డారట. వాళ్లలా వెతుకుతుంటే... అదేంటి కథ నాకు చెప్పి మరో హీరోయిన్ కోసం ఎందుకు వెతుకుతున్నారు అంటూ తిక్కగా మాట్లాడుతోందట. సర్లే అని మళ్లీ ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తోందట. ఎంతకీ రెస్పాండ్ అవడం లేదట. దీన్నిబట్టి ఇక ఆమె ప్రభాస్ సరసన సాహోలో నటించే అవకాశం లేదంటున్నారు. ఇది తెలిసిన కొందరు బాలీవుడ్ జనం... సోనమ్ కపూర్ కేమైనా పిచ్చా అంటూ సెటైర్లు వేస్తున్నారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాచఠీవి దుస్తుల్లో రాజకుమారిలా కనిపిస్తున్న దీపికా (Video)

బాలీవుడ్ స్టార్ హీరోయిన దీపికా పదుకొనే. ఈమె అందం గురించి ఎంత వర్ణించినా అంత తక్కువే. ...

news

సల్మాన్ ప్రియురాలితో వెంకటేష్.. ఒకే కారులో ముంబై వీధుల్లో చక్కర్లు!

టాలీవుడ్ హీరో వెంకటేష్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రియురాలు లులియా వాంటర్‌లు కలిసి ఒకే ...

news

ఎన్టీఆర్ బయోపిక్... రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో..... నిజమా?

స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ నిర్మితంకానుంది. ఈ చిత్రాన్ని ...

news

నాకా ఫోబియా... వాడి ప్రాణాలు తీయడానికే ఆ లారీ ఆగివుంది... ఏడ్చేసిన రవితేజ

రవితేజ తన సోదరుడు భరత్ దుర్మరణం పాలవడంపై మొన్నటివరకూ మీడియా ముందుకు రాలేదు. చివరికి ...

Widgets Magazine