Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈ ప్రపంచంలో ఇన్ని జరుగుతున్నాయి కదా.. నేనే దొరికానంట్రా మీకు... తెల్లమ్మాయి ఫైర్

హైదరాబాద్, శుక్రవారం, 14 జులై 2017 (04:39 IST)

Widgets Magazine

మన ముందుతరం సినిమా నటీ నటుల జీవితాలకు ఇప్పటి వర్థమాన తారల జీవితాలకు మధ్య ఉన్న పెద్ద అంతరం, తేడా ఏదంటే సోషల్ మీడియా. ఒకప్పుడు గాసిప్‌లంటే పత్రికలకే పరిమితమయ్యేవి. తర్వాత టీవీల్లో  నటీనటులకు సంబంధించిన పుకార్లను కాస్త నాజూగ్గా అసభ్యతకు తావీయకుండా చెప్పేవారు. కాని ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని నిద్రరాలేదని మాత్రలు మింగితే క్షణాలో ఆత్మహత్యల వార్తలు ఫేస్ బుక్, ట్విట్టర్‌లో వచ్చేస్తున్నాయి. ఫలానా బాలీవుడ్ నటికి ఫలానా దరిద్రుడితో ఎంగేజ్‌మెంట్ అని లేని వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇంకా కొందరయితే ఏదో కారణానికి ఫలానా నటిని ఇలా చేయండంటూ కోటి రూపాయలకు పైగా డబ్బులిచ్చి మరీ బూతు వీడియోల వరకు లాగుతున్నారు.
 
అయితే పుకార్లకు కొత్త నిర్వనమిచ్చి మెరుపువేగంతో ప్రపంచమంతా పాకిస్తున్న సోషల్ మీడియా ఇప్పుడు ఆ పుకార్లకు గురవుతున్న బాధిత నటిలకు కాస్త ధైర్యమిస్తున్నట్లున్నాయి. తమ మీద గాసిప్ వచ్చిన మరుక్షణం అదే సోషల్ మీడియాలోనే మెరుపులా ప్రతిస్పందన తెలుపుతున్నారు. అలా లేకుంటే తమ మీద వచ్చే గాసిప్ శాశ్వతంగా ఉండిపోతుందన్న భయం కారణం కావచ్చు. అలా తాజాగా ట్విట్టర్లో కూతపెట్టిన నటి సోనమ్ కపూర్. తనకు తెలియకుండా తన పెళ్లివార్త గురించి ప్రచారం జరగడంతో మండిపడ్డారామె. ఈ ప్రపంచంలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే నేనే దొరికినంట్రా మీకు అంటూ తల పట్టుకున్నారు. 
 
‘‘ఈ ప్రపంచంలో ఎన్నో విశేషాలు జరుగుతున్నప్పుడు మరీ నా వ్యక్తిగత జీవితాన్నే టార్గెట్‌ చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు’’ అని ట్విట్టర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు సోనమ్‌ కపూర్‌.  ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తతో సోనమ్‌ వివాహం జరగనుందనే వార్త షికారు చేస్తోంది. ఈ వార్త పై ఆమె షూటుగా స్పందించారు. 
 
‘‘నా వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. నా గురించి ఇలాంటి వార్తలను చెప్పేవారు మా ఫ్యామిలీ మెంబర్స్‌ కాదు. ఒకవేళ నా పెళ్లి కుదిరితే స్వయంగా నేనే చెబుతా. సోనమ్‌ సన్నిహిత వర్గాలు ఆమె పెళ్లి కుదిరిందని చెప్పారని రాస్తున్నారు. నా సన్నిహితులు అని చెప్పుకుంటున్నవాళ్లందరూ నాకు సన్నిహితులైపోరు. అదేంటో కానీ, హీరోల గురించి పెద్దగా గాసిప్పులు రాయరు. బహుశా హీరోయిన్లంటే అలుసేమో. మేం ఎందులో తక్కువో అర్థం కావడం లేదు’’ అన్నారు సోనమ్‌ కపూర్‌. 
 
మొత్తానికి ఈ బ్యూటీకి బాగా కోపం వచ్చిందని అర్థం అవుతోంది కదూ! అయినా మగాళ్ల గురించి గాసిప్పులు రాస్తే ఏ ఏబ్రాసి చదువుతాడు, చూస్తాడు మరి. ఈ ప్రపంచం నేటికీ మగ ప్రపంచమే కదా.. ఆపోజిట్ సెక్స్ గురించి రాస్తే చాలు హిట్లమీద హిట్లు, లైకుల మీద లైక్‌లు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎఫైర్ బయటపెట్టిందనీ, ఆ పని చేసి నగ్న ఫోటోలు తీయమన్నాడా...?(వీడియో)

గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు ...

news

విలన్ పాత్రలో నటి కాజోల్... రజినీ అల్లుడు ధనుష్ విఐపి2లో...

కాజోల్..ఒకప్పుడు అటు తెలుగు, హిందీ చలన చిత్ర సీమను శాసించిన హీరోయిన్. కాజోల్, షారుఖ్ ...

news

తండ్రిని బాధపెట్టే ఏ పని నేనూ, సమంత చేయబోం.. పెళ్ళికి తర్వాత కూడా: చైతూ

టాలీవుడ్ ప్రేమికులు సమంత, నాగచైతన్య త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. తమ వివాహం కోసం సినిమా ...

news

పైసా వసూల్: నేను రూ.4కోట్లు తీసుకున్నానా? ఓవర్‌గా లేదూ.. ఛార్మీ

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ప్రస్తుతం ఆఫర్లు అంతగా లభించట్లేదు. ...

Widgets Magazine