శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : బుధవారం, 25 మే 2016 (14:30 IST)

రూ.12 భిక్షం వేసిన అభిమానిని వదలని సోనూనిగమ్.. ఏంచేశాడంటే...?

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూనిగమ్ 'ది రోడ్ ఉస్తాద్‌'గా మారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలోని ఓ వీధిలో సోనూనిగమ్ భిక్షగాడి వేషంలో దాదాపు 3 గంటల పాటు పాటలు పాడుకుంటూ ముంబై వీధుల్లో గడిపిన సంగతి తెలిసిందే. ముంబై రోడ్డుల్లో పాటలు పాడుతున్న సోనూనిగమ్‌ను ఎవ్వరూ గుర్తుపట్టకపోగా.. చిల్లర కూడా దానం చేశారు. 
 
కానీ, ఓ యువకుడు మాత్రం మారువేషంలో ఉన్న సోను పాటలను రికార్డు చేసుకున్నాడు. అంతేకాదు అతని పాటని మెచ్చుకుని 12 రూపాయలు బహుమతిగా ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు. తన పాట నచ్చి 12 రూపాయలు బహుమతిగా ఇచ్చిన వ్యక్తిని మాత్రం సోనూనిగమ్ వదల్లేదు. ఆ అభిమానిని తన ఇంటికి ఆహ్వానించి కొద్దిసేపు అతనితో ముచ్చటించాడు. 
 
అంతేకాదు అభిమాని దానం చేసిన డబ్బులను ఫ్రేమ్ చేసి జాగ్రత్తగా దాచుకున్న ఫొటోను అతనికి చూపించాడు. ఆ ఫ్రేమ్ తనకు ఎంతో గొప్పదని తెలుపుతూ తన అవార్డుల పక్కన పెట్టారు సోనూనిగమ్‌. 'బీయింగ్‌ ఇండియా' అనే డిజిటల్‌ ఛానల్‌ సోషల్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌ పేరుతో ఓ కార్యక్రమం రూపొందించింది. ఇందులో భాగంగానే రోడ్‌సైడ్‌ ఉస్తాద్‌ పేరుతో ఇలా సోనూనిగమ్‌ రోడ్డు మీద పాటలు పాడుతున్న వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.