'స్పైడర్' సినిమా ఒక్క ఫైటింగ్‌కు రూ.8 కోట్లు..!

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:37 IST)

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'స్పైడర్'. ఈ సినిమా బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ చేసే పోరాట దృశ్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు చాలా గ్యాప్ తర్వాత మహేష్ నటించిన భారీ బడ్జెట్ కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. కానీ సినిమాలో ఇప్పుడు ఒక్క ఫైట్‌కు ఖర్చు పెట్టిన మొత్తం ఖర్చుపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
 
సినిమా సెకండ్ హాఫ్‌‌లో ఒకే ఒక్క ఫైట్ సీన్ కోసం రూ.8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు సినీపరిశ్రమలో ఇంత భారీ మొత్తంలో ఫైటింగ్‌కు డబ్బులు ఖర్చు పెట్టడం ఇదే ప్రథమమంటున్నారు నిర్మాతలు. 
 
ప్రస్తుతం స్పైడర్ సినిమాలో కొత్త గెటప్‌లో మహేష్‌ కనిపిస్తుండడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. హిట్ టాక్‌‍తో నడుస్తున్న ఈ సినిమాకు ఖర్చు పెట్టినంత డబ్బులు తిరిగి వస్తుందా? లేదా? అన్నది కాలమే సమాధానం చెప్పాల్సివుంది. దీనిపై మరింత చదవండి :  
Team Spend Fight Scene Spyder Movie Release

Loading comments ...

తెలుగు సినిమా

news

రెండు పడవలపై కాళ్ళు పెట్టిన కమల్ హాసన్.. ఏమైంది...?

ప్రయాణిస్తే ఒక పడవలోనే ప్రయాణించాలి. లేదంటే మరో పడవలోనైనా ప్రయాణించాలన్నది అందరికీ ...

news

బోరున విలపిస్తూ మమ్మూట్టి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన నటి... ఎందుకు?

మలయాళ నటి అన్నా రాజన్ బోరున విలపించింది. అదీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ముందు. తాను ఎలాంటి ...

news

సినిమాను బ‌ట్టి రివ్యూ ఉంటుంది... క‌క్షతో రివ్యూలు రాస్తామా? : మహేశ్ కత్తి

సినిమాను బ‌ట్టి రివ్యూ ఉంటుంది కానీ, సినిమాల‌పై క‌క్షతో రివ్యూలు రాస్తామా? అని ...

news

ప్రతి గొట్టంగాడి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ప్రతి గొట్టంగాడు చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన పని లేదన ...