శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (14:30 IST)

శ్రీలీల మల్టిటాలెంటెడ్- స్కంధ సాంగ్ అదరగొట్టింది- పిక్స్ వైరల్

Sreeleela
Sreeleela
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందDతో తెరంగేట్రం చేసిన శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. కెరీర్‌లో మొదట్లోనే మంచి హిట్ అందుకున్న ఈ భామ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. 
 
రెండో సినిమాలో రవితేజకు జంటగా నటించి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా వుంది. తాజాగా స్కంధ సినిమాలో రామ్‌తో నటిస్తోంది. ఇటీవలే స్కంధ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన మల్టీ టాలెంటెడ్‌ను నిరూపించుకుంది. 
Sreeleela
 
స్కంధలోని ఓ పాటను థమన్‌తో కలిసి స్టేజీ మీద పాడి బాలయ్య బాబు మన్ననలు పొందింది. శ్రీలీల పాడిన స్కంధ పాట నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా శ్రీలీల గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరలో శ్రీలీల యూత్‌ను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్‌గా మారాయి.
 
ప్రస్తుతం మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా, పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్‌లతో పాటు బాలయ్య భగవంత్ కేసరిలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపుగా ఎనిమిది తెలుగు సినిమాలున్నాయి. 
Sreeleela
Sreeleela
 
శ్రీలీల 14 జూలై 2001న అమెరికాలో జన్మించింది. తెలుగు కుటుంబంలో పుట్టిన ఆమె తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్. అమెరికాలో పుట్టి బెంగళూరులో చదువుకుంది. పెళ్లి సందడికి ముందు కన్నడలో కిస్, భరతే చిత్రాల్లో నటించింది. అక్కడ నటిస్తూనే తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. శ్రీలీల క్లాసికల్ డ్యాన్సర్. ఆమె తండ్రి సూరపనేని శుభాకరరావు.


Sreeleela
Sreeleela