దక్షిణాదికి రావాలంటే జక్కన్న కథ కావాలంటున్న శ్రీదేవి కూతురు

శ్రీదేవి అనగానే జగదేక వీరుడు అతిలోక సుందరి గుర్తుకు వస్తుంది. ఆ మాటకొస్తే ఆమె నటించిన సినిమాలు బోలెడు. అన్నీ ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాలే. ఇక అసలు విషయానికి వస్తే... శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఇటీవలే దఢక్ చిత్రంలో నటించి హిట్ కొట్టింది.

Sridevi-Jhanvi
ivr| Last Modified గురువారం, 4 అక్టోబరు 2018 (16:49 IST)
శ్రీదేవి అనగానే జగదేక వీరుడు అతిలోక సుందరి గుర్తుకు వస్తుంది. ఆ మాటకొస్తే ఆమె నటించిన సినిమాలు బోలెడు. అన్నీ ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాలే. ఇక అసలు విషయానికి వస్తే... శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఇటీవలే దఢక్ చిత్రంలో నటించి హిట్ కొట్టింది. దీనితో అమ్మడికి టెక్కు ఎక్కువైందో ఏమోగానీ తేడాగా మాట్లాడుతోందట.
 
విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంలో జాహ్నవి నటిస్తుందంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇదే విషయంపై ఓ పిల్ల జర్నలిస్ట్ నేరుగా జాహ్నవిని అడిగితే... దక్షిణాది చిత్రాల్లో నటించే ఆలోచన లేదని తేల్చి చెప్పేసిందట. దక్షిణాది తార శ్రీదేవి కుమార్తెవై ఇలా సౌత్ ఇండస్ట్రీ చిత్రాల్లో నటించనని చెప్పడమేమిటని అడిగితే... ఇప్పటికి లేదు... కానీ మంచి కథ దొరికితే నటిస్తానేమో.
 
బాహుబలి లాంటి కథ వస్తే తప్పకుండా ఆలోచిస్తానని అంటోందట. అంటే... దర్శకుడు రాజమౌళి ఆఫర్ ఇస్తే నటిస్తుందన్నమాట. మొత్తానికి జాహ్నవి కపూర్ చాలా పెద్ద టార్గెట్టే పెట్టుకున్నట్లు లేదూ...దీనిపై మరింత చదవండి :