Widgets Magazine

శ్రీకాంత్ అడ్డాల‌కు హీరో దొరికాడా..?

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.... చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించి త‌న‌కంటూ ఓ గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కించిన బ్రహ్మాత్సవం సినిమా డిజాస్టర్ అవ్వ‌డంతో శ్రీకాంత్‌ అడ్డాల కెరీర్‌ ఇ

sarvanand
Srinivas| Last Modified బుధవారం, 16 మే 2018 (20:50 IST)
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.... చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించి త‌న‌కంటూ ఓ గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కించిన బ్రహ్మాత్సవం సినిమా డిజాస్టర్ అవ్వ‌డంతో శ్రీకాంత్‌ అడ్డాల కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. బ్రహ్మాత్సవం ఫెయిల్యూర్‌ తరువాత శ్రీకాంత్‌తో సినిమా చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు. అందుకే తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను రీలాంచ్‌‌లా ప్లాన్‌ చేస్తున్నాడు ఈ యువ దర్శకుడు. 
 
2016 తరువాత ఒక్క సినిమా కూడా చేయని శ్రీకాంత్‌ అడ్డాల లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో గీతా ఆర్ట్స్ సంస్థ సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంద‌ట‌.
 
ఈ సినిమాలో శర్వానంద్‌ హీరోగా నటించనున్నాడు. అన్నదమ్ముల కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో యంగ్‌​ హీరో నటించే అవకాశం​ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం​ చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ రానుంది.దీనిపై మరింత చదవండి :