Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఖరారు?.. హీరోగా జూ.ఎన్టీఆర్?

ఆదివారం, 9 జులై 2017 (13:14 IST)

Widgets Magazine
rajamouli

'బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలే నిజమైతే తొమ్మిదేళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగో చిత్రం ప్రేక్షకుల మందుకు వస్తుంది. 
 
నిజానికి గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇపుడు 'బాహుబలి' తర్వాత మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడన్న ప్రచారం టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారమవుతోంది. 
 
బాహుబలితో వచ్చిన క్రేజ్‌తో జక్కన్నతో సినిమా చేసేందుకు ఎందరో హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, దర్శకధీరుడు మాత్రం మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 
 
మరోవైపు.. రాజమౌళి ఓ హిందీ చిత్రం చేస్తారని, నానీతో ఈగ-2 చేయవచ్చని, అల్లు అర్జున్‌తోనూ చర్చిస్తున్నారని పలు రకాల కథనాలు కూడా వస్తున్నాయి. ఈ వార్తలన్నింటిపై ఓ క్లారిటీ రావాలంటే దర్శకధీరుడే స్వయంగా స్పందించాల్సి ఉంటుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దర్శకేంద్రుడిపై నటి విపరీత వ్యాఖ్యలు.. వెకిలి నవ్వులు... ఎవరా హీరోయిన్? (Video)

తెలుగు చిత్రపరిశ్రమలోని గొప్ప దర్శకుల్లో ఒకరు కె. రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడిగా ...

news

సెట్‌లో రచ్చరచ్చ చేసిన సితార... పగలబడినవ్విన యూనిట్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార. ఈ చిట్టుబుగ్గల చిన్నారి చేసే అల్లరి ...

news

తమిళనాడులో పెరిగిన టిక్కెట్ ధరలు.. బోసిపోయిన థియేటర్లు

జీఎస్టీ పన్ను విధానం పుణ్యమాని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా టిక్కెట్ ధరలు పెరిగాయి. ...

news

ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' కూడా 'చెత్తబాస్' అవుతుందా? కమల్ 'బిగ్‌బాస్'పై విరుచుకుపడిన నటి

తమిళంలో కమల్ హాసన్ హోస్టుగా కొనసాగుతున్న బిగ్ బాస్ షోను ఓ చెత్త షో అని తీవ్రంగా విమర్శలు ...

Widgets Magazine