ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (19:45 IST)

జక్కన్న-మహేష్ బాబు చిత్రంలో.. అవెంజర్స్ హీరో క్రిస్..? (video)

Mahesh Babu
Mahesh Babu
జక్కన్న రాజమౌళి సినిమా అంటే ఇంకేమైనా వుందా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోతాయి. సినిమా సెట్ మీదకు వెళ్లడం దగ్గరనుంచి అందులో ఎవరెవరు నటిస్తున్నారు అనేవరకు అంతా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. తాజాగా ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు, అవెంజర్స్ హీరో క్రిస్ హేమ్స్‌వర్త్ నటిస్తున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
ఈ సినిమాను రాజమౌళి గ్లోబల్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక తాజాగా ఈ చిత్రంలో క్రిస్ నటిస్తున్నది నిజమేనట. అందుకు సాక్ష్యం కూడా ఉందని మహేష్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అదేంటంటే.. మహేష్ తన ఇన్స్టాగ్రామ్ లో క్రిస్ ను ఫాలో అవుతున్నాడు. 
 
అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. చాలా తక్కువమందిని ఫాలో అయ్యే మహేష్ గత కొన్నిరోజులుగానే క్రిస్ ను ఫాలో అవుతున్నాడని.. అతను కూడా మహేష్‌ను ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది.