బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (20:05 IST)

కథ నచ్చింది.. సూర్య, రామ్ చరణ్ కలిసి నటిస్తారా?

Surya
జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ జతకట్టి ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డును పలకరించింది. అగ్రహీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో కనిపించడం ప్రస్తుతం ఫ్యాషనైంది. 
 
తాజాగా సీతారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి తన తాజా కథ యొక్క ఫైనల్ వెర్షన్‌ను ఇటీవల తమిళ సూపర్ స్టార్ సూర్యకు వివరించినట్లు తెలిసింది.
 
స్టార్ తమిళ హీరోకి కథ బాగా నచ్చిందని చెబుతుండగా, ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం, రామ్ చరణ్‌ను ఒకసారి కలవమని సూర్య హనుకి సూచించినట్లు సమాచారం.
 
నిజానికి, హను రామ్ చరణ్‌తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. ఈ నేపథ్యంలో హను రాఘవపూడి కోసం సూర్య సినిమాలో ఈ కీలకమైన అతిధి పాత్రలో నటించడానికి చెర్రీ అంగీకరిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.