శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (12:00 IST)

సికిందర్‌ కలెక్షన్లు తొలిరోజు అదుర్స్.. మూడో రోజుకి ఢమాల్!!

సూర్య - సమత జంటగా నటించిన తాజా చిత్రం 'సికిందర్'. ఈ చిత్రం తమిళంలో కూడా "అంజాన్‌" పేరుతో విడుదలైంది. భారీ అంచనాలతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
అయితే, చిత్రం విడుదలకు ముందే తొలి రెండు రోజులు థియేటర్స్ ఫుల్ కావడంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. కానీ, డివైడ్ టాక్ రావడంతో మూడో రోజుకే ఈ కలక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో చిత్ర యూనిట్ తీవ్ర నిరాశకు లోను చేసింది. 
 
మరోవైపు ఈ చిత్రం నిడివి ఎక్కువగా ఉండటంతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారు. దీంతో పలు సన్నివేశాలను తొలగించారు. ఇందులో టాలీవుడ్ కమెడియన్ కింగ్ బ్రహ్మానందం సన్నివేశాలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ చిత్రం తొలి రోజే పది కోట్లకు పైగా వసూలు చేసినట్టు వినికిడి.