శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 29 ఫిబ్రవరి 2020 (22:28 IST)

సుశాంత్ యాడ్స్ కూడా చేస్తున్నాడా

కాళిదాసు సినిమాతో పరిచయమైన అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కొన్ని సినిమాలు చేసినా సక్సస్ రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఓ డిఫరెంట్ స్టోరీతో చిలసౌ సినిమా చేసాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ హీరోగా అవకాశాలు రాలేదు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టైమ్‌లో అల.. వైకుంఠపురములో సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు.
 
ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడంతో సుశాంత్‌కి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం హీరోగా ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆయన శీతల పానీయం ‘స్ప్రైట్’ తో వాణిజ్య ప్రకటనల (కమర్షియల్ యాడ్స్) ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. 
 
సుశాంత్ ఇప్పుడు ‘స్ప్రైట్’కు బ్రాండ్ అంబాసడర్. ఆ బ్రాండ్‌కు ఆయన చేసిన మొదటి కమర్షియ యాడ్ విడుదలైంది. ఇదివరకటి యాడ్స్ తరహాలోనే ఉత్తేజభరితంగా ఉన్న ఈ టీవీ కమర్షియల్‌లో సుశాంత్ ఉబర్ కూల్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ‘స్ప్రైట్’కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.