Widgets Magazine

ర‌జ‌నీకాంత్ 2.0 రిలీజ్ చేసేందుకు శంకర్ భయపడుతున్నారా?

శుక్రవారం, 15 జూన్ 2018 (15:12 IST)

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాలా రిలీజైంది. ఇక 2.0 రిలీజ్ కావాలి. గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న సంచ‌ల‌న చిత్రం 2.0 ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ..గ్రాఫిక్స్ వ‌ర్క్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న వాయిదా ప‌డుతూనే ఉంది. ఈ సంవ‌త్స‌రం ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి... రాలేదు. ఆ త‌ర్వాత ఆగ‌ష్టులో రిలీజ్ అనుకున్నారు కానీ.. అదీ జ‌ర‌గ‌డం లేదు. 2.0 రిలీజ్ వాయిదా ప‌డుతుండ‌టంతో కాలా సినిమాని రిలీజ్ చేసారు. 
robo
 
ఈ ఏడాది చివ‌ర‌లో రిలీజ్ చేద్దాం అనుకుంటే... ఈ ఏడాది దీపావళికి అమీర్ ఖాన్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' క్రిస్మస్‌కి షారుఖ్ జీరో రిలీజ్ కానున్నాయి. అందువలన 2.0 సినిమాను వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని స‌మాచారం. 2.0 సినిమా కోసం ఎదురుచూస్తుండగానే కాలా రిలీజ్ అయ్యింది. 
 
ఇక 2.0 సినిమా రిలీజఅయ్యే లోపు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తోన్న సినిమా కూడా థియేటర్లకు వచ్చేస్తుందేమో అంటున్నారు. మరోవైపు రజినీకాంత్ 2.0 విడుదల చేసేందుకు దర్శకుడు శంకర్ ఏమైనా భయపడుతున్నారేమోనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కాలా మిశ్రమ స్పందనతో ఆడుతోంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

టాలీవుడ్‌లో మెగా హీరోల బాక్సాఫీస్ వార్.. వెనక్కితగ్గేది లేదంటున్న డెబ్యూ హీరో

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోల మధ్యే బాక్సాఫీస్‌వార్ మొదలైంది. ముఖ్యంగా, మెగా మేనల్లుడు ...

news

''భరత్'' కోసం ప్రియాంక చోప్రా అంత మొత్తం అడిగిందట.. ఎంత?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా సినిమా ''భరత్'' కోసం ప్రియాంక చోప్రా భారీ ...

news

"సమ్"మోహనంగా" ఇంద్రగంటి 'సమ్మోహనం' (మూవీ రివ్యూ)

తెలుగుద‌నానికి పెద్ద‌పీట వేస్తూ... స్వ‌చ్ఛ‌మైన వినోదంతో... సినిమాలు తీసే తెలుగు ...

news

కాలా హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్..?

కాలా సక్సెస్‌తో ఖుషీ ఖుషీగా వున్న సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే కార్తీక్ సుబ్బరాజ్ ...

Widgets Magazine