గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 22 ఏప్రియల్ 2020 (23:51 IST)

కరోనా వైరస్‌తో మానసిక రోగిగా మారిపోయిన హీరోయిన్?

నిజంగా.. నేనేనా.. ఇలా నీ జతలో ఉన్నానంటూ కొత్త బంగారు లోకంతో యువతను ఉర్రూతలూగించింది శ్వేత బసూ. ఆ తరువాత అడపాదడపా కొన్ని సినిమాల్లో చేసింది. అయితే పెద్దగా పేరు రాకపోయినా ఆమె వార్తల్లోని వ్యక్తే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండేది శ్వేత.
 
2018 డిసెంబర్ 13వతేదీన బాలీవడ్ దర్సకుడు రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకున్న శ్వేతాబసు యేడాది తిరగకుండా విడాకులు తీసేసుకుంది. ఆ తరువాత నుంచి ఆమెకు అన్నీ సమస్యలే. 
 
ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం మానసిక స్థితి బాగాలేక శ్వేతాబసు ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెబుతోంది. వీడియో కాల్ ద్వారా థెరపిస్ట్‌తో మాట్లాడిందట. నా మానసిక స్థితి సరిగ్గా లేదు. కరోనా వైరస్‌తో ఎంతోమంది చనిపోతున్నారు బాధగా అనిపిస్తోంది.
 
ఎందుకో ఎదుటివారు బాధపడినా నేను చూస్తూ ఉండలేను. చాలా బాధగా అనిపిస్తుందని చెబుతోంది శ్వేతాబసు. ఇదే విషయాన్ని నా తల్లికి ఫోన్లో చెప్పా. మా అమ్మ, సోదరుడు ఇద్దరూ కలిసి నేనున్న అపార్టమెంట్‌కు వచ్చారు. కానీ వాళ్లను నేను ఉన్న గదికి రమ్మని పిలువలేదు. తెలిసిందేగా కరోనా. కనీసం ఆప్యాయంగా తల్లిని హత్తుకుని ఏడుద్దామనుకున్నా అదీ లేదు. ఐదు అడుగుల దూరంలో నిలబడి మాట్లాడి పంపించేశాను. ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలని దేవుళ్ళను ప్రార్థిస్తున్నానని బాధపడుతూ చెబుతోంది శ్వేతాబసు.