శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 9 మే 2019 (19:27 IST)

తమన్నా స్కిన్ షో ఎందుకు చేస్తోందో తెలుసా..?

రంగస్థలంలో సమంత కొద్ది సీన్స్‌లో మాత్రమే కనిపించింది. కాజల్ కూడా ఒకటి రెండు పాటల్లో శృతిమించుతుంది. కానీ ఏ సీన్ అయినా సాంగ్ అయినా అరకొర డ్రస్సులతో కనిపించే హీరోయిన్ మాత్రం తమన్నానే. సినిమా సినిమాకు గ్లామర్ డోస్‌ను పెంచుతోంది ఈ మిల్కీ బ్యూటీ.
 
టాలీవుడ్లో చాలామంది గ్లామర్ భామలున్నా అవుట్ అండ్ అవుట్ అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ మాత్రం తమన్నానే. పక్కన మరో అందాల భామ ఉంటే తనే ఎక్కువగా అందాల ఆరబోతతో రెచ్చిపోతూ ప్రేక్షకుల హృదయాలను గిరాగిరా తిప్పేస్తోంది. బాహుబలిలో పచ్చబొట్టేసిన సాంగ్‌కు యూత్ ఫిదా అయిపోయింది. ఆ తరువాత తెలుగులో నటించిన బెంగాల్ టైగర్, ఊపిరి, నానువ్వే ఇలా ఒక్కటేమిటో చాలా సినిమాల్లో స్కిన్ షోను టార్గెట్ చేసింది మిల్కీ బ్యూటీ.
 
కళ్యాణ్ రామ్‌తో జతకట్టిన నానువ్వేలో హద్దులు దాటి డ్యాన్స్ చేసింది. గ్లామర్ మాత్రమే సక్సెస్ తీసుకురాదని చాలా సినిమాల్లో చెప్పినా దర్సకులు మాత్రం తమన్నాను గ్లామర్ డాల్‌గానే చూశారు. ఫెర్మామెన్స్‌తో నటించానని చెప్పుకోవడానికి ప్రతి హీరోయిన్‌కు ఒక సినిమా ఉంటుంది. యాక్టింగ్ షోల కంటే స్కిన్ షోలోనే తన ప్రతిభను చూపిస్తోంది.