ఎస్.ఎస్.రాజమౌళిని ఛీ కొట్టిన తమన్నా.. ఎందుకు..?

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:12 IST)

టాలీవుడ్ మిల్కీ బ్యూటీకి ఏమైంది. అస్సలు ఈ మధ్య కనిపించకుండా తిరుగుతోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా మొదట్లో హిట్ కోసం వేచి చూడాల్సి వచ్చింది. అయితే హిట్ కన్నా మంచి పాత్రలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది మిల్కీ బ్యూటీ. మంచి బలమైన పాత్రలు చేస్తూ ఎక్కడా గ్యాప్ రానివ్వకుండా దూసుకుపోతోంది తమన్నా. 
tamannah
 
బాహుబలి హిట్ తరువాత ప్రభాస్, రానా, అనుష్క అందరూ తెగ తిరిగేశారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం పెద్దగా కనిపించలేదు. బాహుబలిలో అవంతిక క్యారెక్టర్‌లో నటించిన తమన్నా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. బాహుబలి-2లో ఎక్కువసేపు తనను చూపించాలని రాజమౌళిని చూపించమని కోరితే అది సాధ్యంకాదని ఆయన చెప్పారట. అందుకే ఆమె సినిమా ప్రమోషన్‌కు పూర్తిగా దూరమై పోయిందట. అయితే అప్పట్లో ఈ విషయంపై తమన్నాను మాట్లాడిస్తే నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను. సినిమా ప్రమోషన్స్‌కు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పింది. 
 
కానీ అసలు విషయం ఏంటంటే రాజమౌళి తనకు సినిమాలో సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్లనే బాగా హర్టయ్యిందట తమన్నా. మరోసారి రాజమౌళి సినిమాలో నటించకూడదని నిర్ణయించుకుని ఇదే విషయాన్ని స్నేహితులకు చెప్పిందట. అయితే స్నేహితులు మాత్రం అలాంటి పని చేయొద్దని 100 సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క రాజమౌళి సినిమాలో ఒక్క దాంట్లో నటించినా ఆ క్రేజ్ వేరని చెప్పారట. అయితే అందుకు తమన్నా ఏ మాత్రం ఒప్పుకోలేదు. ఈ మధ్య కాలంలో రాజమౌళి ఫోన్ చేస్తే మాట్లాడనని ముఖం మీద చెప్పేసిందట. టాప్ డైరెక్టర్‌తో సినిమా చేయనని చెబుతున్న తమన్నా తెలుగు సినీపరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు పడబోతోందో...దీనిపై మరింత చదవండి :  
Tamannah Rejected Rajamouli Baahubali

Loading comments ...

తెలుగు సినిమా

news

నాన్నా.. మీ రుణం మరో జన్మలో తీర్చుకుంటా : జూనియర్ ఎన్టీఆర్

'నాన్నా.. మీ రుణం మరో జన్మలో తీర్చుకుంటా.. ఈ జన్మకు అభిమానులతో ఉండిపోతాను'.. అంటూ తండ్రి ...

news

"జై లవ కుశ" మరో "దాన వీర శూర కర్ణ"... మా తమ్ముడొక్కడే చేయలగలడు : కళ్యాణ్ రామ్

బాబీ దర్శకత్వంలో హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా నిర్మించిన చిత్రం జై లవ కుశ. ఈ చిత్రం ...

news

ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. నేనున్నానంటున్న "జై లవ కుశ" (Trailer)

జూ.ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిన ...

news

ఆ ముగ్గురు హీరోలంటే నాకు చాలా ఇష్టం : నాగబాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తనకి ఎంతో ...