శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (17:01 IST)

పవన్ రోడ్డు మీదికొస్తే రాష్ట్రం అల్లకల్లోలమైపోతుంది.. కారణం, పవన్‌పై ఉండే మూర్ఖపు అభిమానం : తమ్మారెడ్డి

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేక ట్రెండ్ సెట్ చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలో తన మార్క్ అభిమానులను సంపాదించుకోగలిగాడు. అటు సినిమాలతో పాటు ప్రజలకు అండగా ఉండే ఉద్దేశ్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేక ట్రెండ్ సెట్ చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలో తన మార్క్ అభిమానులను సంపాదించుకోగలిగాడు. అటు సినిమాలతో పాటు ప్రజలకు అండగా ఉండే ఉద్దేశ్యంతో ఆయన 'జనసేన' పార్టీని ప్రారంభించారు. తన జనసేన పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉద్దేశ్యంతో 'నేను-మనం-జనం' (మార్పు కోసం యుద్ధం) అనే పుస్తకం రాస్తున్న విషయం తెలిసిందే. 
 
ప్రస్తుతం రాజకీయాల్లో పాల్గొంటున్న పవన్ తనవంతుగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నారు. పవన్‌పై అభిమానులకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే పవన్ కళ్యాణ్‌పై ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానం మూర్ఖత్వంతో కూడుకుని ఉందా? ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా గానీ, తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించారు. 
 
ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ''జనసేన'' అధినేత గురించి చెప్పిన తమ్మారెడ్డి…''పవన్ గనుక రోడ్డు మీదకు వస్తే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైపోతుంది… పవన్‌పై ఉండే మూర్ఖపు అభిమానం, పవనిజం అంటూ వీళ్ళు పిలవడం…" ఇది రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుందని తెలిపారు. ఒక్కసారి బరిలోకి దిగిన పరిస్థితులు పవన్ అదుపులో ఉండవు, నేనేం చెప్తే అది జరుగుతుందని ఆయన అనుకుంటున్నారేమో… అలాగే అయితే మొన్న కాకినాడ సభలో ఒక వ్యక్తి చనిపోయి ఉండకూడదు కదా..! 
 
వేలు కదిపితే మాట వినే రోజులు పోయాయి… అంటూ అభిమానుల తీరును కూడా ఏకరువు పెట్టారు. 18 సంవత్సరాలలోపు వారే ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులన్న మాట నిజమేనని, ఓ 5 వేల మంది ప్రతి నియోజకవర్గం నుండి రోడ్డు మీదకు వస్తే ఆ ఊర్లు ఊర్లు అల్లకల్లోలం అయిపోవడానికి ఆ 5 వేల మంది అని అన్నారు. ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా, నిర్భయంగా ముక్కుసూటిగా మాట్లాడే తమ్మారెడ్డి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.