అర్జున్ రెడ్డి వెరైటీగా అలా రుణం తీర్చుకుంటున్నాడట..

Last Updated: గురువారం, 10 జనవరి 2019 (15:24 IST)
అర్జున్ రెడ్డి హీరో ప్రస్తుతం నిర్మాతగా అవతారం ఎత్తారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా.. పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ఏది చేసినా కొత్తగా వుండాలని కోరుకునే విజయ్.. త్వరలో సొంత బ్యానర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 
 
తక్కువ బడ్జెట్‌లో తన బ్యానర్ నిర్మించి.. ఆ పతాకంపై హీరోగా పెళ్లిచూపులు దర్శకుడిని చూపించాలని విజయ్ అనుకుంటున్నాడట. తనకి పెళ్లి చూపులు ద్వారా మంచి హిట్ ఇచ్చినందుకు కాస్త వెరైటీగా తరుణ్ భాస్కర్ రుణం ఇలా తీర్చుకుంటున్నాడని సినీ జనం అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.దీనిపై మరింత చదవండి :