Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మరో పదేళ్ళ పాటు మీడియా ముందుకు రానంటున్న టాలీవుడ్ డైరెక్టర్!

శనివారం, 8 జులై 2017 (12:53 IST)

Widgets Magazine
Teja

మీడియాతో పెద్ద తలనొప్పి వచ్చిపడిందనీ, తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగి.. చిక్కుల్లోకి నెడుతోందని, అందువల్ల మరో పదేళ్ళపాటు మీడియా ముందుకు రాకూడదని నిశ్చయించుకున్నట్టు ఆ దర్శకుడు చెబుతున్నాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరన్నదే కదా మీ ప్రశ్న. ఎవరో కాదు.. తేజ. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో "నేనే రాజు.. నేనే మంత్రి" చిత్రం తెరకెక్కుతోంది.
 
రానా, కాజల్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే నెల 11న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలో కోసం డైరెక్టర్‌ హోదాలో తేజ మీడియా ముందుకు రావాల్సి ఉంది. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. కొన్ని వివాదాస్పద ప్రశ్నలకు కూడా జవాబులివ్వాలి. అందుకే తేజ ఓ డెసిషన్‌ తీసుకున్నాడట. మీడియా జనాలతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేయ్యాలని నిశ్చయించుకున్నాడట. ఇప్పుడే కాదు మరో పదేళ్ల వరకు మీడియా ముందుకు వెళ్లడకూడదని డిసైడ్‌ అయ్యాడట.
<a class=nene raju nene mantri sill" class="imgCont" height="844" src="http://media.webdunia.com/_media/te/img/article/2017-07/08/full/1499498749-8198.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
ముఖ్యంగా, అర్థంపర్థంలేని ప్ర‌శ్న‌లు అడిగి త‌న‌ని వివాదాల పాలు చేసే మీడియాతో పెద్ద త‌ల‌నొప్పి అని ద‌ర్శ‌కుడు తేజ అన్నారు. అందుకే ప‌దేళ్ల వ‌ర‌కు మీడియాతో మాట్లాడ‌కుండా ఉండేందుకు ప్రయ‌త్నిస్తాన‌ని చెప్పారు.
 
నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో డైరెక్టర్‌ తేజది ఓ విలక్షణమైన శైలి. ఏ విషయం గురించైనా, ఎక్కడైనా ఓపెన్‌గా మాట్లాడడం, కుండబద్దలు కొట్టినట్డు చెప్పడం ఆయన స్టైల్‌. ఈ స్వభావం వల్లే ఆయన ఎన్నో చిక్కులు ఎదుర్కొన్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అందాలు చూపిస్తే చూస్తున్నారు కదా.. బికినీ వేస్తే తప్పేంటి? : పూజా హెగ్డే (Video)

వెండితెరపై అందాలు ఆరబోస్తే సినిమా చూడకుండా థియేటర్ల నుంచి లేచి బయటకు వస్తున్నారా? లేదు ...

news

#BiggBossTeluguOnJuly16 : 'అదీ మ్యాటర్.. వెయిట్ చేయండి.. కలిసే చూద్దాం'.. ప్రోమో రిలీజ్

జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రధాన వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఈనల 16వ తేదీ నుంచి ప్రసారం ...

news

'నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్‌ చాలా ఎనర్జిటిక్' : జాక్వెలైన్ ఫెర్నాండేజ్

నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్ మల్హోత్రా చాలా ఎనర్జిటిక్ అని బాలీవుడ్ నటి జాక్వెలైన్ ...

news

మా ఇంట్లో నాకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోంది : జూనియర్ ఎన్టీఆర్

హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా తమ ఇంట్లో పెద్ద కుట్ర ...

Widgets Magazine