శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 27 జనవరి 2015 (16:05 IST)

'టెంపర్‌' కథేమిటి...? నా తరపు నేనే వాదించుకుందామనీ... జూ.ఎన్టీఆర్...

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో జూనియర్ ఎన్‌టిఆర్‌ నటిస్తున్న 'టెంపర్‌' కథేమిటి? అనేది ఫిలింనగర్‌లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తమ్ముడు కళ్యాణ్‌ రామ్‌ పోలీసు నేపథ్యంలో వచ్చి 'పటాస్‌'ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. లక్ష్మీనరసింహా, గబ్బర్‌సింగ్‌ చిత్రాలను కలిపి ఆ ఛాయలు లేకుండా దర్శకులు అనిల్‌ జాగ్రత్తపడ్డాడు. అయితే తాను నటిస్తున్న టెంపర్‌లో పోలీసు పాత్ర చాలా కొత్తగా వుంటుందని ఎన్‌టిఆర్‌ చెప్పినట్లు తెలిసింది.

 
ఇందులో గతంలో తన తాత చేసిన ఓ చిత్రంలో సీన్‌ తరహా సన్నివేశం పెట్టినట్లు సమాచారం. రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థపై భారీ డైలాగ్‌లను బొబ్బిలిపులిలో ఆనాటి ఎన్‌టిఆర్‌ ఏకేశారు. అయితే ఈ చిత్రంలోని క్లెమాక్స్‌లో అటువంటి తరహా ప్రశ్నలు సంధించేట్లుగా టెంపర్‌ పాత్రను పూరీ తీర్చిదిద్దాడని తెలుస్తోంది.
 
కాగా, ఇంకో ఆసక్తికరమైన అంశమేమిటంటే... ఇందులో సోనియా అగర్వాల్‌ కూడా నటించడం. ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లు నటించిన ఈ చిత్రంలో ఈమె పాత్ర ఐటం సాంగ్‌గా వస్తుందని వార్తలు విన్పిస్తున్నాయి. హీరో ధనుష్‌ సోదరుడు రాఘవన్‌ను పెండ్లి చేసుకుని విడిపోయిన ఈమె ఆ తర్వాత సినిమాల్లో కొనసాగుతూ వుంది.