శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (15:10 IST)

మీనాపై మనసుపడిన రజినీకాంత్ - 168 చిత్రంలో హీరోయిన్‌?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. ప్రస్తుతం "దర్బార్" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తికాకముందే రజినీకాంత్ తన 168, 169 చిత్రాలకు కమిట్ అయ్యారు. ఇందులో 168వ చిత్రానికి అజిత్ హీరోగా వచ్చిన "విశ్వాసం" చిత్రానికి దర్శకత్వం వహించిన శివ దర్శకత్వం వహించనున్నారు. 
 
భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ మూవీ ప్రారంభోత్సవం ఈ నెలాఖరులో ప్రారంభంకానుంది. ఇందులో కీర్తి సురేష్‌, జ్యోతిక‌, మీనా, ఖుష్బూ, మంజు వారియ‌ర్‌ల‌లో ఒక‌రు చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తారని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. 
 
కానీ, చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం మేరకు ర‌జినీకాంత్‌కి జోడీగా హీరోయిన్ మీనాను ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో రజినీ - మీనా కాంబినేషన్‌లో పలు చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా, యజమాన్, వీరా, ముత్తు వంటి చిత్రాలు. 
 
ఇవన్నీ సూపర్ డూప్ హిట్స్. పైగా, 1990 దశకంలో రజినీ - మీనాల జోడిని హిట్ పెయిర్‌గా పేరుగడించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మరోమారు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారట. అయితే, ఈ వార్తలపై 168వ చిత్రాన్ని నిర్మించనున్న నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సివుంది.