అందుకే నేను పెళ్లంటూ చేసుకోను.. సాయిపల్లవి

Last Updated: గురువారం, 13 జూన్ 2019 (14:34 IST)
గత 2015వ సంవత్సరం అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో మలయాళంలో విడుదలైన సినిమా ప్రేమమ్. ఈ సినిమాలో నివిన్, సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో కనిపించారు.


ఇందులో మలర్ పాత్రలో సాయిపల్లవి కనిపించింది. ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి ప్రస్తుతం వైవిధ్యభరిత పాత్రల్లో కనిపిస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. 
 
ఇటీవల సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకేలో సూర్యతో సాయిపల్లవి జతకట్టింది. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి సాయిపల్లవి స్పందించింది. ''నేను పెళ్లి చేసుకోను'' అంటూ బదులిచ్చింది.

ఇందుకు కారణం కూడా చెప్పింది. తాను వివాహం చేసుకుంటే తన తల్లిదండ్రులను చూసుకునే అవకాశం వుండదని.. అందుచేత ఎప్పటికీ వివాహం అంటూ చేసుకోనని స్పష్టం చేసింది సాయిపల్లవి.దీనిపై మరింత చదవండి :