శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శనివారం, 21 అక్టోబరు 2017 (15:53 IST)

ఆ హీరోయిన్‌తో నితిన్ ప్రేమాయణం... పెళ్లి చేస్కుంటాడా?

యువ హీరో నితిన్ పైన ఇప్పటివరకూ ఎలాంటి రూమర్లు రాలేదు. జయం సినిమా దగ్గర్నుంచి నటించుకుంటూ వస్తున్న నితిన్ పైన ఎఫైర్ల ముద్ర లేనేలేదు. కానీ లై చిత్రంలో మేఘ ఆకాష్‌తో నటించిన దగ్గర్నుంచి అతడిపై గుసగుసలు వస్తున్నాయి. ఆ హీరోయిన్‌తో నితిన్ పీకల్లోతు ప్రేమలో

యువ హీరో నితిన్ పైన ఇప్పటివరకూ ఎలాంటి రూమర్లు రాలేదు. జయం సినిమా దగ్గర్నుంచి నటించుకుంటూ వస్తున్న నితిన్ పైన ఎఫైర్ల ముద్ర లేనేలేదు. కానీ లై చిత్రంలో మేఘ ఆకాష్‌తో నటించిన దగ్గర్నుంచి అతడిపై గుసగుసలు వస్తున్నాయి. ఆ హీరోయిన్‌తో నితిన్ పీకల్లోతు ప్రేమలో పడిపోయాడనీ, త్వరలో వీళ్లద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే ఈ వార్తలకు కొద్దిరోజులుగా ఫుల్‌స్టాప్ పడినప్పటికీ మళ్లీ తాజాగా వీరి పేర్లు వినబడుతున్నాయి. 
 
దీనికి కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటించబోతున్నాడు. ఈ చిత్రంలో నితిన్ సరసన లై హీరోయిన్ మేఘ ఆకాష్ మళ్లీ నటిస్తోంది. దీనితో నితిన్ ఆమెతో ప్రేమలో పడటం వల్లనే మరో ఛాన్స్ ఇచ్చాడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఐతే దీనిపై అటు నితిన్ కానీ ఇటు మేఘ ఆకాష్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అందుకే వీళ్లిద్దరూ ప్రేమలో వున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.