శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 16 జనవరి 2017 (16:23 IST)

పాపం త్రిష... జల్లికట్టు దెబ్బకు దాన్ని మూసేసుకుంది...?

జంతువులను హింసిస్తే త్రిష అల్లాడిపోతుంది. ఎంతటివారినైనా ఎదిరిస్తుంది. ఈ విషయంలో త్రిషకు ఎదురులేదు, తిరుగులేదు. తమిళనాడు సాహస క్రీడ జల్లికట్టుకు కోర్టులు బ్రేకులు వేయడం సంగతి ఏమోగానీ నటి త్రిష దీనికి కారణమంటూ ఆమెను బండబూతులు తిడుతున్నారు జల్లికట్టు ప్

జంతువులను హింసిస్తే త్రిష అల్లాడిపోతుంది. ఎంతటివారినైనా ఎదిరిస్తుంది. ఈ విషయంలో త్రిషకు ఎదురులేదు, తిరుగులేదు. తమిళనాడు సాహస క్రీడ జల్లికట్టుకు కోర్టులు బ్రేకులు వేయడం సంగతి ఏమోగానీ నటి త్రిష దీనికి కారణమంటూ ఆమెను బండబూతులు తిడుతున్నారు జల్లికట్టు ప్రియులు. పెటా సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. జల్లికట్టు పోటీల నిర్వహణపై నిషేధం విధించింది.
 
ఈ నేపథ్యంలో జంతు హక్కుల సంరక్షణ సంస్థ 'పెటా' ప్రచారకర్త, నటి త్రిషపై జల్లికట్టు మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆమె తన ట్విట్టర్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జల్లికట్టు పోటీలు నిర్వహించలేకపోవడానికి పెటా సంస్థ కారణమంటూ ఆ సంస్థ ప్రచారకర్తగా ఉన్న త్రిషపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే త్రిష ఖాతాను తాము హ్యాక్ చేయలేదని, ఆమె డీయాక్టివేట్ చేసుకుందని జల్లికట్టు నిర్వాహకులు చెపుతున్నారు. మరి త్రిష తన ట్విట్టర్ ఖాతాను తనకు తనుగా మూసేసుకుందా లేదంటే నిజంగానే హ్యాకింగ్ అయ్యిందా తెలియాల్సి ఉంది.