శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (10:51 IST)

ఇటు ప్రభుదేవా అటు సోనూసూద్ మధ్యలో తమన్నా.. ఏం చేశారు?

మిల్కీ బ్యూటీ తమన్నా, సోనూసూద్, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ''అభినేత్రి''. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను చిత్రయూనిట్ ఇటీవల విడుదల చేసింది. ఈ చిత్రంలో సప్తగిరి, పృథ్విరాజ్‌లు తమదైన కామెడీతో ప

మిల్కీ బ్యూటీ తమన్నా, సోనూసూద్, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ''అభినేత్రి''. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను చిత్రయూనిట్ ఇటీవల విడుదల చేసింది. ఈ చిత్రంలో సప్తగిరి, పృథ్విరాజ్‌లు తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న అభినేత్రి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో అభినేత్రి, హిందీలో టుటక్ టుటక్ టుటియా, తమిళంలో డెవిల్ పేరుతో విడుదలకు సిద్ధం చేశారు.
 
తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ రయిత కోన వెంకట్ నిర్మించగా, తమిళంలో ప్రభుదేవా, హిందీ వర్షెన్‌కు సోనూ సూద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా మూడు బాషల్లోనూ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్ విడుదల చేశారు. ఇందులో లొకేషన్ పూర్తి విభిన్నంగా కనిపిస్తోండగా తమన్నా అటు ప్రభుదేవా ఇటు సోనూ‌సూద్‌లతో చేసిన డ్యాన్స్ అభిమానులని అలరిస్తోంది.