సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (11:11 IST)

మహేష్- రాజమౌళి సినిమా పార్ట్-2 కూడా వస్తుందా? విలన్‌గా అమీర్ ఖాన్?

mahesh new look
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సినిమాలో అమీర్ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రను పోషించడానికి రాజమౌళి అమీర్ ఖాన్‌ను తప్ప మరెవరినీ సంప్రదించలేదని తెలుస్తోంది. 
 
అయితే అమీర్ నెగెటివ్ రోల్ చేయడానికి ఒప్పుకుంటాడా లేదా అని తెలియాల్సి వుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో వుంది రాజమౌళి యూనిట్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమా మీద ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. 
 
మహేష్ బాబుతో తీయబోయే సినిమాను కూడా పార్ట్ 1, పార్ట్ 2గా విభజించబోతున్నట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మంచబోతున్నారు.