గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (14:30 IST)

గుంటూరు కారంలో హైలైట్స్.. ఊర్వశీ రౌటేలా స్పెషల్ సాంగ్

guntur karam ph
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. 
 
ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవనుంది. ఇప్పటికే ఈ మాజీ మిస్ ఇండియా ఊర్వశీ రౌటేలా ఈ మూవీలో సాంగ్ చేస్తుందట. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ. కోటి రెమ్యూనరేషన్‌గా ఇస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని డిసెంబర్ మొదటివారంలో కానీ, రెండో వారంలో కానీ పూర్తి చేస్తారు. 
 
షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు కనక దుర్గమ్మ భక్తుడిగా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయంలో వచ్చే ఓ క్రేజీ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది అని తెలుస్తోంది.