బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (11:01 IST)

రామ్ సరసన వైష్ణవి.. పూరీ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది..

Vaishnavi Chaitanya
''బేబి'' సినిమా హిట్‌తో వైష్ణవి చైతన్య క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ, కథ ఆమె పాత్ర ప్రధానంగానే నడుస్తుంది. ఈ సినిమాకి ఆమె గ్లామర్ .. నటన ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. 
 
ఈ నేపథ్యంలో ఆమెను తమ సినిమాలోకి తీసుకోవడానికి యంగ్ హీరోలంతా గట్టిగానే ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పూరి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. 
 
రామ్ హీరోగా పూరి 'డబుల్ ఇస్మార్ట్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి ఛాన్స్ ఉందట. ఒక హీరోయిన్‌గా వైష్ణవిని ఎంపిక చేయడం జరిగిందని సినీ పండితులు అంటున్నారు.