మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (12:38 IST)

వైష్ణవ్ తేజ్‌కు లక్కీ ఛాన్స్.. నాగార్జున నిర్మాతగా కొత్త చిత్రం

మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన చిత్రంతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నరు. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటించింది. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ క‌థా చిత్రంగా రూపొందించారు. 
 
ఈ సినిమాతో మంచి విజ‌యం సాధించిన వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌స్తుతం ప‌లు క‌థ‌ల‌ను వింటూ ఉన్నాడు. రెండో సినిమాని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌గా, ఈ మూవీ మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుంది. ఇక మూడో సినిమాని వైష్ణ‌వ్ తేజ్ ఎవ‌రితో చేస్తాడు, ఏ నిర్మాణ సంస్థ రూపొందింస్తుంద‌ని అనేక అనుమానాలు అభిమానుల‌లో ఉండ‌గా, దానిపై ఓ క్లారిటీ వ‌చ్చింది.
 
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ త‌న మూడో చిత్రాన్ని డెబ్యూ డైరెక్ట‌ర్‌తో చేస్తాడ‌ట‌. అత‌ను చెప్పిన స్టోరీ న‌రేష‌న్ వైష్ణ‌వ్ తేజ్‌కు న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. మ‌నం ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఈ చిత్రానికి వైష్ణ‌వ్ తేజ్ మూడు కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని టాక్. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.