Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విశాల్‌తో ప్రేమలో పడిన శరత్ కుమార్ కుమార్తె... ఆన్‌ స్క్రీన్‌పై రొమాన్స్‌కు సై...

మంగళవారం, 30 మే 2017 (12:15 IST)

Widgets Magazine
varalakshmi - vishal

హీరో శరత్ కుమార్‌కు, యువ హీరో విశాల్‌కు మధ్య వ్యక్తిగత వైరం ఎప్పటి నుంచో వుంది. తన కుమార్తె వరలక్ష్మిని ప్రేమలో పడేశాడన్న కోపం విశాల్‌పై ఉంది. పైగా, నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్‌ ప్యానెల్‌ను విశాల్ వర్గం చిత్తుగా ఓడించింది. దీంతో వారిద్దరి మధ్య వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ కుమార్తెతో ఆన్‌ స్క్రీన్‌పై రొమాన్స్ చేసేందుకు విశాల్ సిద్ధం కావడాన్ని శరత్ కుమార్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
ప్రస్తుతం ఈ వార్తే కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. కలిసి నటించింది ఒకే ఒక్క సినిమాలో అయినా చిన్నప్పటి నుండి స్నేహితులు కావడంతో విశాల్ - వరలక్ష్మీ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందని కోలీవుడ్ వర్గాలు ఎప్పటి నుండో చెబుతున్నాయి. శరత్ కుమార్‌తో వైరం కారణంగా బయటకు వ్యక్తం చేయడం లేదు కానీ... విశాల్... వరలక్ష్మీని వివాహం చేసుకునేది ఖాయమనీ కొందరంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో 'మదగజరాజా'లో తొలిసారి జోడీ కట్టిన ఈ జంట... ఇప్పుడు మరోసారి స్క్రీన్‌ను షేర్ చేసుకోబోతోంది... విశాల్ నటించి, నిర్మించబోతున్న 'పందెం కోడి' సీక్వెల్‌లో వరలక్ష్మీ ఓ కీలక పాత్ర పోషించబోతోందట. లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం తొలి భాగంలో మీరా జాస్మిన్ హీరోయిన్‌గా నటించగా... ఇందులో కీర్తి సురేశ్ చేస్తోంది... అయితే మరో కీలకమైన పాత్రకు వరలక్ష్మీని ఎంపిక చేశారట. విశేషం ఏమంటే... ఇప్పటికే ఆరేడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న వరలక్ష్మి... విశాల్ మీద ప్రేమతో ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చిందట... జులైలో సెట్స్ కెళుతున్న 'పందెం కోడి' సీక్వల్ ఈ లవర్స్‌ను ఇంకెంత దగ్గర చేస్తుందో చూడాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''గన్స్ అండ్ థైస్'' ట్రైలర్‌లో న్యూడ్ సీన్లు.. ట్విట్టర్‌కు వర్మ రాం రాం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు వీడియోలు..

''గన్స్ అండ్ థైస్'' వెబ్ సిరీస్ ట్రైలర్ కలకలం రేపుతోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ...

news

'మసాలా' చిత్రాల్లో నటిస్తుంటే ఆ మజానే వేరప్పా అంటున్న బాలీవుడ్ నటి!

మంచి చిత్రాల్లో, మంచి పాత్రల్లో నటించి.. పదికాలాల పాటు గుర్తుండిపోయే నటిగా ఉండాలని ప్రతి ...

news

ప్రియాంక చోప్రా బోల్డ్‌గా చెప్పేసింది.. సిగరెట్, మందు కంటే.. శృంగారమే బెటర్.. షారూఖ్ లెదర్ జాకెట్?

హాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన తర్వాత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. బోల్డుగా ...

news

భ్రమరాంబ పాత్ర రకుల్ కోసమే పుట్టిందా లేక భ్రమరాంబను రకుల్ లాగేసుకుందా?

ఒక సినిమా పాత్ర పదేళ్లు లైఫ్ ఇస్తుందంటే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ ప్రేక్షకులు అలాంటి ...

Widgets Magazine