శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (16:24 IST)

పెళ్లైన కొత్తలోనే కత్రినాకు విక్కీ కౌశల్ అన్యాయం చేశాడా?

Vicky_kaushal
Vicky_kaushal
పెళ్లైన కొత్తలోనే బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కత్రినా కైఫ్‌కు షాకిచ్చాడు. హీరోయిన్‌ త్రిప్తితో రొమాంటిక్ హీరోగా మారాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా.. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం ఆనంద్ తివారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం సంగతి తెలిసిందే.
 
కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం క్రొయేషియాలో రొమాంటిక్ సాంగ్‌ చిత్రీకరణ జరుగుతుండగా.. సెట్స్ నుంచి లీకైన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
ఫరా ఖాన్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్‌లో తెల్లటి దుస్తులు ధరించి విక్కీ కనిపించగా హీరోయిన్‌గా నటిస్తున్న త్రిప్తి డిమ్రీ ఎల్లో కలర్ క్రాప్ టాప్‌తో పాటు రఫుల్ లాంగ్ స్కర్ట్‌లో దర్శనమిచ్చింది. 
 
కాగా షూట్‌లో భాగంగా నటిని ఎత్తుకోవడం వంటి స్టిల్స్ చూసిన నెటిజన్లు ఇద్దరి కెమిస్ట్రీ బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేగాకుండా కత్రినాకు అన్యాయం చేయొద్దంటూ విక్కీపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.