శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (13:03 IST)

యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్న విక్రమ్ ''ఇరుమురుగన్'' రిలీజ్ వాయిదా

విక్రమ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న తమిళ చిత్రం ''ఇరుముగన్''. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిత్యామీనన్, నయనతారలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిలన్‌, లవ్‌ అనే రెండు వి

విక్రమ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న తమిళ చిత్రం ''ఇరుముగన్''. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిత్యామీనన్, నయనతారలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిలన్‌, లవ్‌ అనే రెండు విభిన్న పాత్రల్లో విక్రమ్‌ కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన చిత్ర ట్రైలర్‌ను చూస్తే విక్రమ్‌ సినిమాపై అంచనాలను మరోసారి భారీగా పెంచేసింది. 
 
లవ్‌ పాత్రలో కనిపించిన విక్రమ్‌ను చూస్తే నటనలో ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటానని నిరూపించేలా ఉంది. ఈ చిత్రం తెలుగులో 'ఇంకొకడు' పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడినట్లు కోలీవుడ్‌ వర్గాల విశ్వసనీయ సమాచారం.
 
 సెప్టెంబర్‌ 2వ తేదీన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్న నేపథ్యంలో సినిమాలో గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తి కాకపోవడంతో సినిమాని 8న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్‌ ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్ర టీజర్‌ ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో సంచలనం రేపుతోంది. మరి ఈ చిత్రంతో విక్రమ్ ఇంకెన్నిసంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే.