శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (10:47 IST)

శ్వేతాబసు కోసం క్యూ కడుతున్న నిర్మాతలు.. నిజంగానే ఛాన్స్‌లిస్తారా? లేక...?

సినీ అవకాశాలు లేక వ్యభిచార రొంపిలోకి దూకిన సినీనటి శ్వేతా బసు ప్రసాద్‌ కోసం ఇపుడు టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. అవకాశాలు లేక ఇంట్లో గోళ్లుగిల్లుకుంటూ కూర్చొనివున్న సమయంలో ఆమెను ఏ ఒక్క నిర్మాత చేరదీసిన, గుర్తుకు తెచ్చుకున్న పాపాన పోలేదు. అదే శ్వేతాబసు ఒక స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడటంతో ఆమెకు సినీ అవకాశాలు ఇస్తామంటూ అనేక మంది నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు గుప్పిస్తున్నారు. 
 
ఇలాంటి నిర్మాతలు నిజంగానే శ్వేతాబసుకు అవకాశాలు ఇస్తారా లేక మరో విధంగా వాడుకునేందుకే ఆమెను దగ్గరకు చేరదీస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. శ్వేతా బసుకు ఎంతో మంచి భవిష్యత్ ఉందని, మంచి నటనాశీలి అని మెచ్చకుంటున్న నిర్మాతలకు ఆమె వ్యభిచారం కేసులో పట్టుబడకముందు ఆమె టాలెంట్ గురించి తెలయదా అనే ప్రశ్నా ఉత్పన్నమవుతోంది. 
 
నిజానికి ఒకనాడు మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్వేతాబసుకు ఆ తర్వాత ఏ భాషలోనూ ఛాన్సులు లేక పోవడంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుంది. వీటి నుంచి గట్టెక్కేందుకు ఆమె పడుపు వృత్తిని ఎంచుకుంది. ఈ వ్యభిచారం కేసులో పట్టుబడ్డ తర్వాత.... ఆమెకు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తామంటూ పలువురు దర్శకులు, మంచు విష్ణు వంటి హీరోలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. 
 
తాజాగా శ్వేతా బసుకు మరో అవకాశం వచ్చింది. శ్వేతా బసును ‘మక్డీ' చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం చేసిన విశాల్ భరద్వాజ్ తను తీయబోయే సినిమాల్లో ఆమె కోసం స్పెషల్ రోల్ క్రియేట్ చేస్తానని, అవకాశం కల్పిస్తానని అన్నారు. శ్వేతా బసును టాలెంట్ ఉన్న ఆర్టిస్టుగా పొగడ్తలు గుప్పించారు. నిజంగా అవకాశాలు ఇచ్చే నిర్మాతలెవ్వరూ ఇలా ప్రకటనలు చేయరనే వాదనలూ లేకపోలేదు.