మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (13:50 IST)

పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్ లో అసలు నటులు ఎక్కడ?

Pushpa 2 artists
Pushpa 2 artists
పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ రాత్రి హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరిగింది. కానీ ముందస్తు ప్రణాళిక ప్రకారం మల్లారెడ్డి కాలేజీలో గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేయాల్సివుంది. కానీ వాతావరణ ద్రుష్ట్యా ఈ వెంట్ చిత్తూరులో కూడా జరగడకుండా, మల్లారెడ్డిలో జరగకుండా ఇండోర్ స్టేడియంలో జరిగింది. అక్కడి అభిమానులను చూసి ఫంక్షన్ కు వచ్చినవారంతా ఆనందపడ్డారు. కానీ కాస్త లోటుగా అనిపించిన సంఘటనలు కూడా జరిగాయి. పుష్ప 2 సినిమాలో నటించిన చాలామంది నటీనటులు గైర్హాజరయ్యారు.
 
దీనిగురించి నటి అనసూయే ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ, సునీల్ గారు ఎందుకు రాలేదు. నాకు అర్థంకాలేదు. ఆయన నాకు పెయిర్. ఆయన లేడు. బ్రహ్మాజీ లేడు. ఇలా కొద్దిమంది పేర్లు చెప్పి ఊరుకుంది. సినిమా గురించి నేను చెప్పేదేమిలేదు. మీకు తగ్గేదేలే అన్నట్లుగా వుంటుందని తెలిపింది.
 
అయితే ఈ సినిమాలో వారిద్జదరే కాకుండా. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, ఫాజిల్, రావురమేష్ వంటి వారు కూడా రాలేదు. పుష్ప 2 సినిమాలో నటించామని గర్వంగా చెప్పుకోవడానికి కూడా రాలేదేమిటి? వచ్చిన హీరోయిన్, డాన్సర్ అయిన శ్రీలీల కూడా నాకు ఇందులో భాగమైనందుకు ఆనందంగా వుందంటూ తెలిపింది. మరి ఆ ఆనందం మిగిలిన నటీనటుల్లో లేదా? అనేది చర్చగా మారింది.
 
ఇదంతా కేవలం అల్లు అర్జున్ హీరోగా నిలవాలనేది అర్థమవుతుంది. అందుకే తన ఫంక్షన్ గా మార్చేశాడు. తన కుమారుడు, కుమార్తె ఆర్హన్, ఆద్యలతో కూడా స్టేజీ ఎక్కి మాట్లాడించారు. కుమార్తె అయితే ఏకంగా తెలుగు పద్యాన్ని పాడి అలరించింది. ముందుగా ఇలా ప్లాన్ వేసుకున్న బన్నీ నటీనటుల విషయంలో నిర్మాతల్ని ఒప్పించలేకపోయాడా? అనేది కొద్ది రోజుల్లో బయటపడనుంది.