శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 26 జూన్ 2017 (13:10 IST)

ఎన్టీఆర్ 'బిగ్ బాస్‌'కు యాంకర్ సుమ నో... వాళ్లందరికంటే పెద్ద స్టార్ అనుకుంటోందా?!!

వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ఎన్టీఆర్ బిగ్ బాస్ గురించి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటే చర్చ నడుస్తోంది. ఇతర భాషల్లో జరగబోయే బిగ్ బాస్ షోలకు ఇంత పెద్ద హంగామా జరుగుతుందో లేదో కానీ తెలుగులో మాత్రం వ్యవహారం బాగా పబ్లిసిటీ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర

వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ఎన్టీఆర్ బిగ్ బాస్ గురించి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటే చర్చ నడుస్తోంది. ఇతర భాషల్లో జరగబోయే బిగ్ బాస్ షోలకు ఇంత పెద్ద హంగామా జరుగుతుందో లేదో కానీ తెలుగులో మాత్రం వ్యవహారం బాగా పబ్లిసిటీ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా పనిచేస్తున్నాడని తెలియడంతో అంచనాలు భారీగా వున్నాయి. ఇకపోతే ఈ షోలో పాల్గొనేందుకు పార్టిసిపెంట్స్ కావాలి కదా... ఇందుకోసం పోసాని కృష్ణమురళి, మధుశాలిని, తేజస్వినిలతో పాటు యాంకర్ సుమను కూడా సంప్రదించారట. 
 
ఐతే సుమ దీనికి నో చెప్పినట్లు ఫిలిం నగర్ సమాచారం. ఆమె నో చెప్పడానికి ఎవరికివారు ఏవేవో చెప్పేస్తున్నారు. ఈ షోలో పాల్గొనేందుకు అంగీకరిస్తే ముంబైలో చాలాకాలం వుండాల్సి రావడం సుమకు ఎంతమాత్రం ఇష్టంలేక మానేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా... తనతోపాటు సెలక్ట్ చేసిన నటీనటులు కూడా ఒక కారణమని సమాచారం. 
 
వాళ్లకంటే సుమ చాలా బిజీ కనుక తన బిజీ షెడ్యూలును అన్ని రోజుల పాటు కేటాయించడం సాధ్యం కాదని నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఆఖరుగా ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ కు అవమానం అంటూ ఓ సెక్షన్ వాదిస్తోంది. సమస్య ఏమిటో కానీ యాంకర్ సుమ మాత్రం షోలో పాల్గొనేది లేదని స్పష్టం చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.