శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By CVR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (12:33 IST)

టీనేజ్ యువకుడితో అన్నారు... కానీ చిన్న పిల్లాడితో చేయమన్నారు... పూనమ్ ఆవేదన

సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'శ్రీదేవి' లో ముఖ్యపాత్రని ప్రముఖ నటీ పూనమ్ కౌర్ పోషిస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమైంది. రెండు రోజులు షూటింగ్ తర్వాత ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రకటించారని సమాచారం. 
 
అందుకు కారణం కథ చెప్పిన సమయంలో టీనేజ్ కుర్రాడు అని చెప్పి... చిత్రంలో నటించే సమయంలో 10 ఏళ్ల వయస్సు గల ప్రణీత్తో నటింప చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిందట. ఈ అంశంపై తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని సమాచారం. . 
 
కాగా తొలుత రాంగోపాల్ వర్మ 'సావిత్రి' పేరుతో చిత్రాన్ని చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సావిత్రి చిత్రం పేరుపై మహిళా సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. దీంతో వర్మ 'సావిత్రి'ని పక్కన పెట్టి 'శ్రీదేవి' పేరును ఖరారు చేశాడు. ఆ చిత్రానికి శ్రీదేవి పేరు ఖరారు చేయడంపై ప్రముఖ నటీ శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

శ్రీదేవి భర్త బోనీకపూర్ ఈ చిత్రం టైటిల్‌పై రామ్ గోపాల్ వర్మకు కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చారు. అయితే తాను శ్రీదేవి పేరుతో చిత్రాన్ని నిర్మించి తీరుతానని వర్మ బహిరంగ ప్రకటన చేశారు. నటి శ్రీదేవికి ఈ టైటిల్ పాత్రకు ఎలాంటి లింకు లేదని తెలిపారు. ఓ టీచర్, ఓ విద్యార్థి మధ్య నడిచే కథనాన్ని ఇతివృత్తంగా తీసుకుని రామ్గోపాల్ వర్మ శ్రీదేవి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.