శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 9 మే 2017 (05:35 IST)

సెలబ్రిటీలనే కాదు వాళ్ల కూతుళ్లను కూడా లాగుతున్న యూట్యూబ్ చానెళ్లు

‘సింగర్ సునీత కూతురుని చూశారా... కత్తి లాగా ఉంది’ అంటూ టీనేజ్ వయసులో ఉన్న సునీత కూతురి గురించి నీచమైన హెడ్డింగ్ పెట్టి, సునీత అప్పుడప్పుడూ కూతురితో కలిసి దిగిన ఫోటోలను కలిపి ఓ వీడియో సృష్టించారు. ఈ వీడియో యూట్యూబ్‌లో పెను దుమారమే రేపింది. సింగర్ సునీ

వ్యూస్ , హిట్లు యావలో పడి కొట్టుకుపోతున్న యూట్యూబ్ చానెల్స్ సెలబ్రిటీల కూతుళ్లను కూడా వదలకుండా ఘోరమైన హెడ్డింగులు పెట్టి వారి తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలిస్తున్నాయి. తెలుగులో కొన్ని యూట్యూబ్ చానెల్స్ మరీ బరితెగించి సెక్సువల్ హెడ్డింగులు పెట్టి లేని చోట కూడా ఏదో ఉన్నట్లు పెడర్థాలు లాగుతూ వెర్రితలలు వేస్తున్నాయి. ప్రముఖ తెలుగు గాయని సునీత, ఆమె కుమార్తెకు సంబంధించి ఓ యూట్యూబ్ చానెలె ప్రదర్సించిన అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు గురవుతోంది. 
 
‘సింగర్ సునీత కూతురుని చూశారా... కత్తి లాగా ఉంది’ అంటూ టీనేజ్ వయసులో ఉన్న సునీత కూతురి గురించి నీచమైన హెడ్డింగ్ పెట్టి, సునీత అప్పుడప్పుడూ కూతురితో కలిసి దిగిన ఫోటోలను కలిపి ఓ వీడియో సృష్టించారు. ఈ వీడియో యూట్యూబ్‌లో పెను దుమారమే రేపింది. సింగర్ సునీతకు ఈ విషయం తెలిసి అగ్గి మీద గుగ్గిలమైందట. 
 
ఒక టీనేజ్ వయసున్న అమ్మాయి గురించి మరీ ఇంత నీచంగా హెడ్డింగ్స్ పెడతారా అంటూ మండిపడిందట. తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా భావించిందట. అయితే ఇలాంటి యూట్యూబ్ చానళ్లు ఎన్నో ఉన్నాయని, ఎన్నింటి మీద ఫిర్యాదు చేయగలమని ఊరుకుందట. కానీ ఇంత నీచంగా ఓ అమ్మాయి గురించి పోస్ట్ పెట్టడానికి ఆ అడ్మిన్‌కు మనసెలా వచ్చిందోనని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
 
ఒకటి మాత్రం నిజం.. సెలబ్రిటీల ప్రయివేట్ జీవితాలకు భద్రత లేని కాలమిది. అది ప్రముఖ వ్యక్తులకు, వారి కుటుంబాలకు శాపమే మరి. వాళ్లను వాళ్ల మానాన బతికేయడానికి కాస్త వదిలేయండి ప్లీజ్..