శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (11:18 IST)

టాలీవుడ్ "శ్రీమంతుడు" - తొలి తెలుగు చిత్రంగా...

ప్రిన్స్ మహేష్ బాబు - శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం "శ్రీమంతుడు". గత 2015లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సుకన్యలు కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా 2.0 బిలియన్లు వసూలు చేసింది. 
 
బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించిన ఈ చిత్రం తాజాగా స‌రికొత్త రికార్డుని త‌న ఖాతాలో వేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో 99,080,385 మంది వీక్షించ‌గా, ఇంత‌ వ్యూస్‌ని సంపాదించిన మొద‌టి తెలుగు మూవీగా 'శ్రీమంతుడు' నిలిచింది. త్వరలో 100 మీ వ్యూస్‌ను క్రాస్ చేయనుంది.
 
ఇకపోతే, సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన‌ 'శ్రీమంతుడు' చిత్రం తన తండ్రి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందిన యువకుడి కథ నేప‌థ్యంలో రూపొందింది. 
 
దేవరకోట అనే మారుమూల గ్రామంలో తన తండ్రి పూర్వీకుల మూలాల గురించి తెలుసుకున్నప్పుడు, హర్ష వర్ధన్ గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నించడమే ఈ చిత్రం కథ.